బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (14:51 IST)

జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే.. ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడు : సమంత

Samantha -tw
టాలీవుడ్ హీరోయిన్ సమంత సుధీర్ఘకాలం తర్వాత తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అదేనని చెప్పారు. తన ఇష్టాయిష్టాలను తన భాగస్వామి ప్రభావితం చేశాడంటూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా తన వైవాహిక జీవితంపై కామెంట్స్ చేశారు. 
 
"నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యాను. దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎందుకంటే గతంలో నా భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు. క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైంది. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల ఆరంభమైంది" అని అన్నారు. 
 
కాగా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సమతం... తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు, ఆమె కొన్ని రోజుల క్రితం నిర్మాతగానూ మారారు. "ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్' అనే పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు.