ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (15:26 IST)

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంట‌గా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్

Santosh Shobhan, Faria Abdullah
Santosh Shobhan, Faria Abdullah
సోష‌ల్‌మీడియా నేప‌థ్యంలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అనే చిత్రం రాబోతుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంట‌గా న‌టిస్తున్నారు. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌కుడు.  ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రూపొందుతోంది. చిత్రాన్ని నవంబర్ 4న విడుదలచేస్తున్న చిత్ర యూనిట్ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది.
 
వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్షలు అందిస్తూ ఈ  సినిమా విడుద‌ల తేదీని ప్రక‌టించారు నిర్మతాలు. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్  నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో సంతోష్, ఫారియా బ్రీఫ్‌కేస్‌ పై కూర్చుని లవ్లీగా కనిపించారు.
 
ఇటివలే విడుదలైన ఈ సినిమా టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రొమాన్స్, సస్పెన్స్‌తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని టీజర్ భరోసా ఇచ్చింది. నెల్లూరు సుదర్శన్ ఈ సినిమాలో హిలేరియస్  పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
 తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్