పిల్లోడు వచ్చేంత వరకు ఇంట్లో స్వీట్లు వండొద్దు : షారూక్ ఖాన్ భార్య
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్. ఈయన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయి ముంబై అర్థర్ రోడ్డులో ఉన్న కేంద్ర కారాగారంలో ఉన్నాడు. అతనికి బెయిల్ ఇప్పించేందుకు షారూక్ ఖాన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉండటంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం లేదు.
ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు గత రెండు వారాలుగా కంటి నిండ నిద్రకూడా పోవడం లేదు. పైగా, అన్నపానీయాలను సైతం సరిగ్గీ తీసుకోవడం లేదట. కొడుకు జైల్లో ఉండటంతో షారూక్ కుటుంబం దిగాలుగా ఉంటోంది. అతడికి త్వరగా బెయిల్ రావాలని తల్లి గౌరీఖాన్ పూజలు చేస్తూనే ఉన్నారు. అంతేనా ఆర్యన్ తిరిగొచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వండొద్దని గౌరీ తన వంట సిబ్బందికి ఆర్డర్ వేశారట.
ఇటీవల షారూక్ నివాసం మన్నత్‌లో మధ్యాహ్న భోజనం కోసం వంట సిద్ధం చేస్తున్న సిబ్బంది ఖీర్ వండారు. దీన్ని గుర్తించిన గౌరీ వెంటనే కిచెన్‌లోకి వెళ్లి దాన్ని ఆపారు. ఆర్యన్ బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చేవరకు మన్నత్ కిచెన్‌లో ఎలాంటి స్వీట్లు వండటానికి వీల్లేదని గౌరీ ఆదేశించినట్లు షారూక్ సిబ్బంది ఒకరు మీడియాకు తెలిపారు.
సాధారణంగా పండగ రోజుల్లో మన్నత్ వేడుకలతో కళకళలాడిపోయేది. అయితే ఇప్పుడు ఆర్యన్ జైల్లో ఉండటంతో షారూక్ కుటుంబం ఈ వేడుకలకు దూరంగా ఉంది. ఇటీవల నవరాత్రి రోజుల్లో గౌరీ తన కొడుకు కోసం నిరంతరం పూజలు చేశారని సదరు సిబ్బంది వెల్లడించారు.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అక్టోబరు 20న తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి. జైల్లో ఉన్న ఆర్యన్.. ఇటీవల షారూక్, గౌరీలతో కొంతసేపు వీడియో కాల్ మాట్లాడాడు.
ఆ సమయంలో అతడు కింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు జైల్లో ఆర్యన్‌కు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని హామీ ఇచ్చాడు.