జనవరి 1న విడుదలవుతున్న ''షకీలా''.. శృంగార తారగా ఎస్తర్
అలనాటి శృంగార తార షకీలా నిజజీవితం ఆధారంగా రూపొందిన చిత్రం "షకీలా". ఇంద్రజీత్ లంకేశ్ రచన, దర్శకత్వం వహించగా రీచా చెడ్డ, పంకజ్ త్రిపాటి, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్ మరియు సందీప్ మలాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 1న యుఎఫ్‌ఓ మూవీస్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ- `చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులముందుకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి సినిమాలో భాగం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. షకీలా గారి లైఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. జనవరి 1 సినిమా విడుదలవుతుంది. తప్పకుండా చూడండి`` అన్నారు.
సందీప్ మలాని మాట్లాడుతూ - ``నాకు ఏడు సంవత్సరాల వయసున్నప్పటి నుండి నేను శ్రీదేవి గారికి వీరాభిమానిని. తెలుగులో చాలా సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు షకీలా సినిమా ద్వారా మిమ్మల్నందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఈ చిత్రం కర్ణాటకలోని తీర్థహల్లి, అలాగే బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది మీ అందరి సపోర్ట్ కావాలి`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వీర్ మాట్లాడుతూ - ``మాది బీదర్. నేను సినిమాలు చూడడానికి హైదరాబాద్‌కి రెగ్యులర్‌గా వస్తుంటాను. ఇప్పుడు నా సినిమా ప్రమోషన్‌కోసం ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో రెండు అద్భుతమైన పాటల్ని కంపోజ్ చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతాయని భావిస్తున్నాను`` అన్నారు.
నటి షకీలా మాట్లాడుతూ - ``ఈ సినిమా గురించి అందరూ చాలా బాగా మాట్లాడారు నాకు చాలా సపోర్ట్‌గా ఉన్న సందీప్ మలాని గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు. జనవరి 1న సినిమా విడుదలవుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే షకీలా అంటేనే సెన్సార్ ఇవ్వరు. అలాంటిది నా ఆటోబయోగ్రఫి షకీలా సినిమాకి ఎలా సెన్సార్ తీసుకుని ఉంటారో ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. జనవరి 1న సినిమా చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది. టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. ఎంటైర్ నా లైఫ్ గురించి అనే కాదు కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సినిమా చాలా బాగా వచ్చింది. షకీలా సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ మోటివ్‌లోనే చూడండి అది చాలు`` అన్నారు.
ఈ కార్యక్రమంలో యూఎఫ్ఓ మూవీస్ ప్రతినిధి లక్ష్మణ్, నటుడు రాజీవ్ పిళ్లై, ఇన్నోవేటివ్ ఫిలిం ఉపాసన తదితరులు పాల్గొన్నారు. సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రకాష్ పళని సమర్పకులు. సుందీప్ మలాని అసోసియేట్ నిర్మాత. డిఓపి సంతోష్ రాయ్ పతజే, ఎడిటింగ్ బల్లు సలుజ. ఇట్స్ సామిస్ మ్యాజిక్ సినిమా, ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ మరియు పళని ఇంటర్నేషనల్ మీడియా వర్క్స్ ప్రెజెంటేషన్. ఈ సినిమాలోని పాటలు జీ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.