శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (14:25 IST)

హైడ్ న్ సిక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన శివాజీ

Hide n Sick team with Shivaji
Hide n Sick team with Shivaji
సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్. హైడ్ న్ సిక్ మోషన్ పోస్టర్ ను నటుడు శివాజీ విడుదల చేశారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ,  హైడ్ న్ సిక్ సినిమా డైరెక్టర్ బసిరెడ్డి రానా #90 సినిమా చేస్తున్నప్పటి నుంచి తెలుసని, మంచి వ్యక్తిత్వంతో పాటు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన వర్క్ చాలా డైనమిక్ గా ఉంటుందని అన్నారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన #90 చిత్రంలో తాను కరాటే మాస్టర్ గా ఒక చిన్న రోల్ చేశాడని, ఆరోజే సెట్ లో తన వర్క్ స్టైల్ చూశానని శివాజీ చెప్పారు. హైడ్ న్ సిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు. ప్రొడ్యూసర్ కేవలం స్క్రిప్టును, డైరెక్టర్ బసిరెడ్డి రానాను నమ్మి డబ్బులు పెట్టారు అంటే.. మనం అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ డైనమిక్ ఏంటని అని యాక్టర్ శివాజీ వెల్లడించారు. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి కి మంచి విజయం చేకూరుతుందని తెలిపారు. అలాగే హీరో హీరోయిన్లు ఇద్దరికీ అభినందనలు చెప్పారు. 
 
ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని.. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు.
 
మల్లి అంకం మాట్లాడుతూ.. ఈ చిత్రం డైరెక్టర్ బసిరెడ్డి రానా తాను ఒక చిత్రానికి కలిసి పని చేసినట్లు.. ఆయన టాలెంట్ ఏంటో తనకి తెలుసు అని చెప్పారు. కచ్చితంగా హైడ్ న్ సిక్ చిత్రం ప్రేక్షకులను ఆదరిస్తుందని, ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తీసుకొస్తుందని పేర్కొన్నారు.
 
డైరెక్టర్ ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. బసిరెడ్డి రానా తనకు చాలా కాలంగా మంచి స్నేహితుడని, ఈ సినిమా గురించి చాలాసార్లు తనతో డిస్కస్ చేసినట్లు కథ అద్భుతంగా ఉందని చెప్పారు. సినిమా కూడా చాలా వరకు చూశానని చాలా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు. సినిమాపై కమాండ్ తో పాటు చాలా కాన్ఫిడెన్స్ ఉన్న దర్శకుడు బసిరెడ్డి రానా అని ఆదిత్య హాసన్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించిన హీరో విశ్వంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. కేరింత మూవీ నుంచి తన యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పారు.
 
డైరెక్టర్ నవీన్ మేడారం మాట్లాడుతూ.. బసిరెడ్డి రానా తన దగ్గర అసోసియేట్ గా పని చేశాడని, అతను ఒక్కడు ఉంటే చాలు సెట్ అంతా చాలా హుషారుగా ఉంటుందని చెప్పారు. ఒకరోజు ఫోన్ చేసి సినిమా ఓకే అయిందని కథ చెప్పాడు. అది వింటే చాలా అద్భుతంగా ఉందని, చాలా యూనిక్ వేలో ఉందని, కథ చెప్పిన దానికంటే అద్భుతంగా తెరకెక్కించగలడని ఆయన నమ్మినట్లు.. అదే నిజమైందని నవీన్ మేడారం తెలిపారు. అలాగే హీరో విశ్వంత్ తనకు చాలా కాలంగా తెలుసు అని అద్భుతమైన నటుడని పేర్కొన్నారు. ఇక నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి యుఎస్ లో ఉంటాడని ఆయనకు సినిమా తీయడం అంటే ఎప్పటినుంచో ప్యాషన్ అని అందుకే ఈ సినిమాను తెరకెక్కించాడని నవీన్ మేడారం పేర్కొన్నారు.
 
దర్శకుడు బసిరెడ్డి రానా మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ నవీన్ మేడారం ఒక క్రైమ్ థ్రిల్లర్ ని ఇలా కూడా చెప్పొచ్చా అని.. ఎక్సైట్మెంట్ తో ఆయన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నట్లు చెప్పారు. ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి అయినా డోర్ కొడితే వెంటనే తీసే గొప్ప వ్యక్తి నవీన్ మేడారం అని తెలిపారు. కచ్చితంగా సినిమా అందరిని రంజింప చేస్తుందని ప్రామీస్ చేశారు. చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
 
హీరోయిన్ శిల్ప మంజునాథ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను ఒక పోలీస్ క్యారెక్టర్ లో నటించినట్లు చెప్పారు అది చాలా స్ట్రాంగ్ రోలని డైరెక్టర్ ఆ పాత్రను నా రేట్ చేసినప్పుడే అర్థం అయిందని అన్నారు. తాజాగా చిత్రాన్ని చూసినప్పుడు తాను ఏదైతే చెప్పారో దాన్నే ప్రజెంట్ చేశారని ప్రేక్షకులకు తన పాత్ర గుర్తుండి పోతుందని తెలిపారు. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి కమిట్మెంట్ అండ్ కరేజ్ ఉన్న ప్రొడ్యూసర్ అని ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరారు.
 
హీరో విశ్వంత్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాలకు కటౌట్లు కట్టిన రోజు నుంచి ఆయన బర్త్ డే రోజు తన సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం అనేది చాలా అద్భుతమైన సంఘటన అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్న నవీన్ మేడారం మొదటి కాపీని చూసి అద్భుతంగా ఉంది అని తనకు ఫోన్ చేయడంతో రిలాక్స్ అయినట్లు విశ్వంత్ పేర్కొన్నారు. కేరింత మనమంతా లాంటి చిత్రాలకు ఇదే రకమైన రెస్పాన్స్ వచ్చిందని, ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చిందని ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని తెలిపారు. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.