శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 మే 2021 (16:26 IST)

సోనూ సూద్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం.. (వీడియో) వైరల్

SonuSood
రియల్ హీరో, హెల్పింగ్ హ్యాండ్ సాయం పొందిన వారి పాలిట "గాడ్".. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఆపదలో వున్న వారిని ఆదుకుంటున్న సోనూసూద్‌కు ఇటీవల తెలంగాణ వాసి గుడి కట్టిన సంగతి తెలిసిందే.
 
ఇప్పుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సోనూ ఫ్యాన్స్ ఆయన భారీ కటౌట్ ఏర్పాటు చేసి, పాలాభిషేకం చేశారు. ప్రతి ఒక్కరు సోనూ సూద్ గారిని ఆదర్శంగా తీసుకుంటే భారతదేశంలో కరోనా మరణాలు ఉండవని కోరుకుంటూ.. అని వ్రాసి పోస్టర్‌కు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ‌ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ రైతేరాజుగా పిలవబడే మన భారతదేశంలో రైతు కష్టాల్ని సోషల్ మీడియా ద్వారా చూసి మదనపల్లె ప్రాంత రైతుకు ట్రాక్టర్‌ను బహూకరించిన ఇండియన్ రియల్ హీరో సోనూసూద్ అన్నారు.‌ ఆయన చేసిన వితరణకు గుర్తుగా పాలాభిషేకం,అన్నదానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 
 
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రైతు నాగేశ్వరరావు కుమార్తెలకు చదువు అందించడానికి ముందుకు రావడం హర్షనీయం అన్నారు.