గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (13:30 IST)

మహాభారతం ప్రాజెక్టులో ఆ ఇద్దరు హీరోలు- జక్కన్న క్లారిటీ

ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా తారక్ కొమరం భీమ్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క అభిమాని, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 
 
ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్న వేళ.. జక్కన్న రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 
 
ఇప్పటికే మహాభారతం సినిమాలో హీరోలను ఫిక్స్ చేసినట్లు స్వయంగా రాజమౌళి వెల్లడించారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే ప్రమోషన్ కార్యక్రమాలలో రామ్ చరణ్ మాట్లాడుతూ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ లో మేమిద్దరం ఉంటామా? అని చరణ్ రాజమౌళిని ప్రశ్నిస్తే అందుకు రాజమౌళి స్పందిస్తూ.. హా తప్పకుండా వుంటారని సమాధానం చెప్పారు. దీంతో మహాభారతం సినిమాలో కూడా మరోసారి ఎన్టీఆర్ రామ్ చరణ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
 
అయితే మహాభారతం ప్రాజెక్ట్ పట్టాల ఎక్కడానికి మరి కాస్త సమయం పడుతుంది. ఇలా రాజమౌళి మహాభారతం సినిమా గురించి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.