బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 డిశెంబరు 2023 (10:56 IST)

నన్ను వెన్నుపోటు పొడిచింది, నిజాలన్నీ బైటపెడతా: నటి జాక్వెలిన్ బెదిరిస్తూ ఖైదీ లేఖ

Jacqueline Fernandez
బాలీవుడ్ నటి జాక్వెలిన్ తనను నమ్మించి మోసం చేసిందనీ, వెన్నుపోటు పొడిచిందని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. తాను ఎవరినైతే ప్రాణంగా నమ్మానో వాళ్లే నన్ను మోసం చేస్తారనీ, వెన్నుపోటు పొడుస్తారని కలలో కూడా అనుకోలేదు. వారు చెబుతున్న మాటలతో నా గుండె ముక్కలైంది. నాపై నిందలు వేస్తూ నన్ను చెడ్డవాడిగా చూపిస్తున్నారు. 
 
ఈ దారుణం నేను సహించలేకపోతున్నా. ఇక నా వద్ద వున్న నిజాలను బైట పెట్టడమొక్కటే నాకున్న దారి. వీటిని చూసైనా ప్రజలు ఎవరు వంచకులో తెలుసుకునే వీలుంటుంది అని పరోక్షంగా నటి జాక్వెలిన్ ను ఉద్దేశిస్తూ ఆర్థిక నేరగాడు సుకేశ్ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
 
అతడి లేఖపై జాక్వెలిన్ వెంటనే ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసారు. అతడు తనను ట్రాప్ చేసాడనీ, తనపై వున్న కేసును కొట్టివేయాలనీ, అతడికి-తనకు ఎలాంటి సంబంధం లేదని అభ్యర్థించింది.