శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (19:55 IST)

లియో రిలీజ్: సినిమా థియేటర్‌లో దండలు మార్చుకున్న ఫ్యాన్స్

Leo
Leo
ద‌ళ‌ప‌తి విజ‌య్ చిత్రం లియో రిలీజై థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంది. ఫేవ‌రేట్ హీరో సినిమా మొద‌టిరోజు ఎవ‌రైనా చూస్తారు. కానీ ఓ అభిమాని మాత్రం కాస్త కొత్తగా ఆలోచించాడు. లియో థియేట‌ర్లో ఏకంగా త‌న కాబోయే భార్య‌ను తీసుకొచ్చి దండ‌లు మార్చుకున్నారు. 
 
ఉంగ‌రాలు మార్చుకున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ జంట త‌మిళనాడులోని పుదుకుట్టే జిల్లాకు చెందిన‌వారు. వెంక‌టేష్‌, మంజుష అనే వీరికి ద‌ళ‌ప‌తి విజ‌య్ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే థియేటర్‌లో వివాహం చేసుకున్నట్లు చెప్పారు.
 
పెద్దలు వీరి పెళ్లి ముహుర్తం అక్టోబ‌ర్ 20న ఫిక్స్ చేయ‌గా, వారు మాత్రం త‌న ఫెవ‌రేట్ హీరో విజ‌య్ లియో సినిమా రిలీజ్‌న అంటే గురువారం అక్టోబర్ 19న థియేట‌ర్‌లో పెళ్లిచేసుకుని అంద‌రికి షాక్ ఇచ్చారు.