పెళ్ళి కాకుండానే తల్లి అవుతున్న హీరోయిన్, ఎవరు?
కల్కి. ఈమె ఉత్తరాది భామ. బాలీవుడ్ దర్సకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య. ఈమె వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అనురాగ్ కశ్యప్‌తో విడాకుల తరువాత ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది ఈ భామ.
అంతటితో ఆగకుండా ప్రియుడితో వివాహం కాకపోయినా తల్లి కాబోతోంది కల్కి. పెళ్ళికి ముందే పిల్లల్ని కనడం అంటే ఏదో తప్పు చేసినట్లుగా ఈ సమాజం చూస్తుందంటూ వాపోతోంది. అలాంటి సమాజం కోసం తన పద్ధతులు, పనులు మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం తాను తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది. తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటానని.. సమాజంలో ఎవరు ఏమి అనుకున్నా డోంట్ కేర్ అంటోంది ఈ ఉత్తరాది భామ. అదే మన దక్షిణాధిలో అయితే ఇలా చేస్తే ఊరుకుంటారా?