సోమవారం, 4 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (22:16 IST)

చెరుకు రసం తీసిన సింగర్ సునీత.. వీడియో వైరల్ (video)

Sunitha
Sunitha
సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల ప్రకృతిని తెగ ప్రేమిస్తున్న సునీత వాటి మధ్య ఎక్కువగా గడుపుతుంది. కారులో వెళ్తున్న ఆమెకు మార్గమధ్యంలో చెరకు గానుగ కనిపించింది. 
 


 
ఇంకేముందీ, వెంటనే కారు దిగి గానుగను తిప్పుతూ చెరుకు రసం తీసింది. దీనికి సంబంధించిన వీడియోను సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె "కావాలా చెరుకు రసం, సమ్మర్‌ గ్లో.." అని అభిమానులను ఊరించింది.
 
 
ఇక సునీత గానుగ తిప్పడంపై ఫ్యాన్స్‌ స్పందిస్తూ "సూపర్‌ మేడమ్‌, ఇది మంచి వర్కవుట్‌ కూడా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే గానుగ తిప్పే సమయంలో చెరుకు రసం తీసే వ్యక్తికి ఆ కర్రను కూడా తగిలించింది.
 
కాస్త గట్టిగా తగిలి ఉంటే అతనికి గాయం కూడా అయి ఉండేది. బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది సునీత.