శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (10:28 IST)

ఐదు పదుల వయసు దాటినా నటి శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

shobana
చిత్రపరిశ్రమలోని సీనియర్ హీరోయిన్లలో శోభన ఒకరు. ఈమె వయసు 50 యేళ్లు దాటాయి. కానీ, ఇప్పటికీ ఆమె వివాహం చేసుకోలేదు. బ్యాచిలర్‌గా ఉంటూనే ఓ బిడ్డకు తల్లిగా ఉంది. ఈ బిడ్డ ఆమె దత్తత తీసుకున్నారు. వివాహం చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నప్పటికీ తాను ఎంతో సంతోషంగా ఉన్నట్టు ఆమె చెబుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్​గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభన 1984లో 'ఏప్రిల్ 18' అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్​గా మారింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 230 సినిమాల్లో నటించింది.
 
శోభన ఒక మంచి భరతనాట్య డ్యాన్సర్ కూడా. చెన్నైలో చిత్ర విశ్వేస్వరన్ అనే గురువు దగ్గర నాట్యం నేర్చుకుంది. 1989లో డ్యాన్స్ స్కూల్ స్థాపించి కలిపిన్య అని పేరు పెట్టింది. ఆ తర్వాత 1994లో చెన్నైలో భరతనాట్యానికి ఒక డ్యాన్స్ స్కూల్ స్థాపించి దానికి కలర్పానా అని పేరు నామకరణం చేసింది. 1994 నుంచి సూర్యకృష్ణమూర్తి నిర్వహించే సూర్య మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఈవెంట్‌లో నృత్యం చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం సినిమాల కన్నా తన కళను ఎక్కువమందికి నేర్పించాలనే ఉద్దేశంతో భరతనాట్యం మీదే దృష్టి పెట్టారు ఆమె.
 
ఇకపోతే, వ్యక్తిగత విషయాలకు వస్తే... వివాహం కాని నటీమణులలో శోభన ఒకరు. 50 ఏళ్లు వచ్చిన ఇంకా అదే అందాన్ని మెయిన్ టెయిన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. ఆమెకు సంబంధించిన వింటేజ్ ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ తెగ ట్రెండింగ్ అవుతుంటాయి. కుర్రాళ్లు కూడా ఇంకా ఆమె అందానికి ఫిదా అవుతూనే ఉన్నారు. అయితే ఈమె మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. 
 
పెళ్లి గురించి ఆమెను ఎవరైనా అభిప్రాయం అడిగితే మాత్రం 'పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో పెళ్లే కాదు చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగానే ఉన్నాను' అంటూ కచ్చితంగా చెప్పేస్తుంది. అయితే పెళ్లి బంధంతో సంబంధం లేకుండా ఆమె గత 2011లో ఒక అమ్మాయిని దత్తత తీసుకుని సింగిల్ మదర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.