శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (14:51 IST)

వీకే శశికళగా కనిపిస్తున్న మధుబాల?

మణిరత్నం హీరోయిన్ మధుబాల.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రోజా, జెంటిల్ మెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మధుబాల.. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరంగా వుండిపోయింది.


2008లో బాలీవుడ్‌లో కభీ సోచా భీ నా థా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది మధుబాల 2013లో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్‌లో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన మధుబాల ప్రస్తుతం తమిళ సినిమా అగ్నిదేవిలో నటించింది. 
 
ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను ఎన్నో సినిమాలు చేసినా అవార్డులు మాత్రం రాలేదని అవార్డ్ వచ్చేదాకా సినిమాలు చేస్తానని వెల్లడించింది. ఈ సినిమాలో తను పొలిటిషియన్ పాత్రలో నటిస్తున్నానని.. నిజ జీవితానికి దూరంగా వుండే పాత్ర ఇదని మధుబాల తెలిపింది. ఈ చిత్రంలో తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళలా కనిపిస్తోందని టాక్ వస్తోంది. ఈ సినిమా శుక్రవారం (మార్చి 22)న విడుదలైంది.