శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:58 IST)

వైజాగ్‌లో గుండెపోటుతో మరణించిన టాలీవుడ్ హాస్య నటుడు

allu ramesh
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్య నటుడు అల్లు రమేష్ మంగళవారం వైజాగ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని యువ దర్శకుడు అరవింద్ రవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అల్లు రమేష్ మృతి వార్త తెలిసిన పలువురు సినీ నటులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, హీరోగానే కాకుండా, అల్లు శిరీష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో వచ్చిన "సిరిజల్లు" చిత్రంలో ఆయన తొలిసారి సినీ రంగంలో ప్రవేశించారు. ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోల్లో అల్లు రమేష్ ఒకరిగా నటించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఆయన కమెడియన్‌గా నటించారు. 
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన "కేరింత" చిత్రంలో నూకరాజుకు తండ్రి పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన నెపోలియన్ చిత్రంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. వెబ్ సిరీస్‌లలో సైతం ఆయన నటించారు.