ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (17:26 IST)

ఎన్టీఆర్ డబ్బింగ్, జాన్వీ స్టయిలింగ్‌పై ట్రోలింగ్..!

Devara
Devara
దేవర సినిమా ఐదు బాషల్లో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ ,కన్నడ,  మలయాళంలో ఈ సినిమా అనువాదమవుతోంది. కాగా మలయాళం మినహా మిగలిన భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. 
 
కన్నడ వెర్షన్ డబ్బింగ్ అయితే నాలుగు గంటల్లో ఎన్టీఆర్ ముగించారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కన్నడ వెర్షన్ డబ్బింగ్‌కు ఐదు గంటల సమయం తీసుకుంటే.. ఈసారి ఓ గంట ముందుగానే పూర్తిచేశాడన్నది ప్రచారం సారాశం.
 
అయితే ఇదే ట్యాలెంట్ ఎన్టీఆర్ ఇతర వెర్షన్‌ల విషయంలోనూ చూపించి, త్వరత్వరగా డబ్బింగ్‌లను పూర్తి చేసి ఉండవచ్చు గాక.. కానీ హిందీ వెర్షన్‌కు జూనియర్ ఇచ్చిన డబ్బింగ్‌పై ఇప్పుడు చర్చ  నడుస్తొంది. హిందీ యాక్సెంట్ ఎన్టీఆర్ నోట వింటుంటే కామెడీగా ఉందని.. ట్రైలర్‌లో సీరియస్ మోడ్‌లో డైలాగ్స్‌ను ఎన్టీఆర్ చెబుతుంటే, నవ్వొస్తుందంటూ నార్త్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇక ట్రైలర్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ కనిపించిన తీరుపై కూడా నెటిజెన్స్ మధ్య చర్చ నడుస్తొంది. జాన్వీ చీరకట్టు వ్యాంప్ పాత్ర మాదిరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది. హీరోయిన్ పక్కన ఉన్న ఆర్టిస్ట్‌ల డ్రెస్సింగ్‌తో  పొలిస్తే జాన్వీ స్టయిలింగ్ ఎందుకంత అసహ్యంగా ఉంది. కొంపదీసి కొరటాల దాన్నే గ్లామర్ అనుకుంటున్నారా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.