శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (12:01 IST)

బిగ్ బాస్ షోను ఎలా చూస్తున్నారో.. అదో చెత్త షో..?

Allu Arjun
Allu Arjun
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ షో పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ వస్తోంది. తాజాగా అల్లు అర్జున్‌ వరుడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాను శ్రీ బిగ్ బాస్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. 
 
బిగ్ బాస్‌ వంటి షోను ఇండియాలో బ్యాన్ చేయాల్సిందే అన్నట్లుగా కొందరు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో.. భాను శ్రీ వ్యాఖ్యలు సైతం చర్చకు దారితీశాయి. బిగ్ బాస్ షో ని ప్రేక్షకులు ఎలా చూస్తున్నారో అర్థం కావడం లేదని భానుశ్రీ తెలిపింది. ఆ షో ఎందుకు అంత విజయం సాధిస్తుందో తనకు ఇప్పటికి ఆశ్చర్యంగానే ఉంటుంది. 
 
అంతే కాకుండా ప్రతి సీజన్‌కి కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున రేటింగ్ ఇవ్వడం కూడా విడ్డూరంగా అనిపిస్తుంది. తన దృష్టిలో బిగ్ బాస్ షో అనేది ఒక చెత్త షో అంటూ ఆమె ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం భాను శ్రీ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.