శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (18:27 IST)

ఆ దర్శకుడి మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్న అర్జున్ రెడ్డి.. ఎవరు..?

విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత గీత గోవిందం సినిమా విజయ్ దేవరకొండ చరిష్మాను అమాంతం పెంచేసింది. అమ్మాయిలైతే విజయ్ దేవరకొండ సినిమా వస్తోందంటే తెగ సంబరిపోతుంటారు. 
 
అలాంటి విజయ్ దేవరకొండకు ఈ మధ్య కాలం కలిసినట్లు లేదు. ఆయన నటించిన సినిమాలను పెద్దగా ప్రేక్షకులను ఆదరించడం లేదు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు విడుదలైన వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ కూడా అభిమానులను నిరాశకే గురిచేసింది.
 
అయితే తన లక్‌ను కాకుండా తన ఫిజిక్‌ను నమ్ముకోవడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ. అది కూడా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడట విజయ్ దేవరకొండ. 
 
ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్. సినిమా అంటే ఒక లక్. అయితే నీకు మంచి ఫిజిక్ ఉంది. ఆ ఫిజిక్‌ను బాగా మెరుగుపరుచుకో. అప్పుడు నీ కోసం కొన్ని కథలు దాని కదే పుట్టుకొస్తాయి. దర్శకులు నీ ముందు క్యూకడతారని చెప్పారట పూరీ జగన్నాథ్. 
 
దీంతో విజయ్ దేవరకొండ అప్పటి నుంచి కండలను పెంచడం ప్రారంభించాడట. అది కూడా సిక్స్ ప్యాక్ చేసేందుకు సిద్థమవుతున్నాడట. తన ఫిజిక్ పెంచుకోవడానికి తెగ ప్రయత్నించేస్తున్నాడట. చూద్దాం.. దర్శకుడి సలహా ఏ మేరకు పనిచేస్తుందో...