ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (17:08 IST)

సువర్ణా.. ఏందే.. నీ యవ్వ.. అలా అంటున్నావ్.. విజయ్ కామెంట్స్ వైరల్

వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్రీ ఈవెంట్‌లో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌పై హీరో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. జయ్ దేవరకొండ కామెంట్ సాధారణంగానే ఆకర్షణీయమైన పదజాలం ఉపయోగిస్తూ వుంటాడు. అయితే తాజాగా విజయ్ ఏకంగా హీరోయిన్‌నే "ఏందే నీ యవ్వ.. అలా అంటున్నావ్." అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. 
 
వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్రీ ఈవెంట్ కార్యక్రమంలో ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించే ఛాన్స్ రావడం అదృష్టమని చెప్పింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పింది. ఆమె మాట్లాడుతున్న సమయంలో 'గారు' అనే పదాన్ని బాగా గమనించిన విజయ్ దేవరకొండ.. తన టైమ్ రాగానే అదే వేడుకలో ఆమెపై కామెంట్ విసిరాడు. 
 
"ఐశ్వర్యా.. గారు గారు అంటున్నావ్.. ఏంటి? సువర్ణా.. ఏందే.. నీ యవ్వ.. గారు గారు అంటున్నావ్" అంటూ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఐశ్వర్య నటించిన ఈ తొలి తెలుగు సినిమాలో అద్భుతంగా నటించిందని.. తెలుగు బాగా మాట్లాడుతోందని చెప్పాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్‌పై మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి.