శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2024 (18:02 IST)

నివేతా థామస్, ప్రియదర్శి ల 35-చిన్న కథ కాదు నుంచి వింత లోకం సాంగ్ రిలీజ్

35-chinna katha kadu song sean
35-chinna katha kadu song sean
నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా మేకర్స్ చిన్నా ఇది వింత లోకం సాంగ్  రిలీజ్ చేశారు. చిల్డ్రన్స్, ఇన్నోసెంట్ హార్ట్స్ ని బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేసిన ఈ పాటని వివేక్ సాగర్ సూపర్బ్ గా కంపోజ్ చేశారు. భరద్వాజ్ గాలి రాసిన లిరిక్స్ అందరూ రిలేట్ చేసుకునేలా వున్నాయి. సింగర్ విజయ్ ప్రకాష్  లైవ్లీగా పాడిన ఈ పాట  మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది.  
 
స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది.
 
ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.
 
"35-చిన్న కథ కాదు" తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
 
నటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్