1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (14:51 IST)

బీజేపీకి రాజీనామా చేసిన వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ

Vivek Venkataswamy
Vivek Venkataswamy
మాజీ ఎంపీ, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. 
 
ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. మరికాసేపట్లో వివేక్ వెంకటస్వామి నోవా టెల్ హోటల్‌కు వెళ్లి రాహుల్ గాంధీని కలవనున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ పెదపడెల్లి ఎంపీగా గెలుపొందారు. 
 
ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్ వెంకటస్వామి ఇప్పటి వరకు బీజేపీలోనే కొనసాగుతున్నారు.
 
వివేక్ వెంకటస్వామి పార్టీ మారతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నాడు. తాజాగా ఆయన తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపారు.