సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (16:11 IST)

ఆర్జీవీ వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా

vyuhama photo
తెలంగాణ హైకోర్టు దర్శకుడు ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై తెలుగుదేశం నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, మరోసారి పరిశీలించాక సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. 
 
దీంతో కోర్టు ఆదేశాలతో మరోసారి ఈ సినిమా సెన్సార్ బోర్డు రివ్యూ చేసి పలు సూచనలు ఇచ్చింది. అలాగే కొన్ని సన్నివేశాలు కూడా తొలగించి కొత్త రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది. 
 
దీనిని ఆమోదించిన హైకోర్టు ఈ మూవీని విడుద‌ల చేసుకోవ‌చ్చ‌ని ఆదేశాలు జారీ చేసింది.. దీంతో వ్యూహం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16న విడుదల కానుంది. వ్యూహం సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించారు. వైఎస్ భారతి పాత్రను మానస పోషించారు. 
 
రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే  వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందించిన యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ కానుంది.