నటీనటులు- గోపీచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి, ప్రవీణ్ తదితరులు
టెక్నికల్ టీం: సమర్పణ - అల్లు అరవింద్, బ్యానర్ - జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్, నిర్మాత - బన్నీ వాస్, దర్శకుడు - మారుతి, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, మ్యూజిక్ - జేక్స్ బీజోయ్, సహ నిర్మాత - ఎస్ కే ఎన్, లైన్ ప్రొడ్యూసర్ - బాబు, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ - సత్య గమిడి, ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భవ్, సినిమాటోగ్రఫి - కరమ్ చావ్ల, పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.
విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా `పక్కా కమర్షియల్`. పేరుతోనే ప్రతిఒక్కరికీ ఏదో సందర్భంలో కనెక్ట్ అయ్యే టైటిల్‌తో వచ్చారు. కొంతకాలం గేప్ తర్వాత గోపీచంద్ హీరోగా చేసిన ఈ సినిమాలో రాశిఖన్నా నాయిక. పాటలు, ట్రైలర్‌లోనే కొత్తదనం కనిపించిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి అది ఎలా వుందో చూద్దాం.
కథః
పేదలకు న్యాయం జరగాలనే వృత్తిని ఎంచుకున్న జడ్జి (సత్యరాజ్) ఓ వ్యాపారవేత్త (రావురమేష్) వల్ల ఓ యువతి జీవితంలో జరిగిన అన్యాయానికి సరైన ఆధారంలేదని తీర్పుఇవ్వాల్సి వస్తుంది. అవమానంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది తెలిసి చలించిపోయిన జడ్జి (సత్యరాజ్) పదవికి రాజీనామా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత చిన్న దుకాణం పెట్టుకుని జీవితాన్ని సాగిస్తుంటాడు. చిన్నతనంలో ఇవన్నీ గమనిస్తూ పెరిగిన ఆయన కొడుకు గోపీచంద్ లాయర్ వృత్తి చేపడతాడు. అయితే తండ్రికి విరుద్ధమైన రూటులో వెళ్లి సెటిల్‌మెంట్లు చేస్తూ పక్కా కమర్షియల్ లాయర్‌గా పేరుపొందుతాడు. అంతేకాకుండా వ్యాపారవేత్త సత్యరాజ్‌కు అండగా వుంటూ ఆయనమీద వచ్చే కేసులను పరిష్కరిస్తుంటాడు. ఇది తెలుసుకున్న సత్యరాజ్ మళ్ళీ లాయర్ కోటువేసుకుని కొడుడు చేపట్టిన కేసులను వాదిస్తాడు. ఆ తర్వాత ఏమయింది? ఈ క్రమంలో టీవీ సీరియల్లో ఫేమస్ అయిన నటి లాయర్ ఝన్సీ గోపీచంద్‌కున్న పరిచయం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ఈ కథ ఆద్యంతం సరదాగా వుండేలా దర్శకుడు మారుతీ రాసుకుని తెరకెక్కించాడు. లాజిక్కులు చూడకండి అంటూ ముందుగానే చెప్పేసిన మారుతీ ప్రేక్షకుడిని నవ్వించే ప్రయత్నం చేశాడు. అందుకు ఆయన ఎంచుకున్న కథ బాగుంది. రాశీఖన్నాను టీవీ సీరియల్లో ఫేమస్ లాయర్‌గా చూపించి ఆమెచేత ఫన్ చాలా క్రియేట్ చేశాడు. ఆమె అనుచరులు సప్తగిరి, వైవాహర్ష తోడయ్యారు. కొండను ఢీ కొట్టాలంటే ఆవేశం పనికిరాదు. ఆలోచన ముఖ్యమని చెబుతూ దాన్ని అమలుచేసే కేరెక్టర్‌లో లాయర్ గా గోపీచంద్ ఇమిడిపోయాడు .ఇదేం కొత్త కథకాదు. చెప్పేవిధానం కొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించాలనే ప్రయత్నం అని ముందే చెప్పేసిన దర్శకుడు తను చెప్పింది కరెక్టే అని ప్రేక్షకుడికి కలుగుతుంది. ముగింపులో వరలక్ష్మీ శరత్‌కుమార్ లాయర్‌గా వచ్చి ట్విస్ట్ ఇస్తుంది.
టెక్నికల్‌గా జేక్స్ బీజోయ్ సంగీతం, నేపథ్యం సంగీతం కథకు సరిపడేవిధంగా వున్నాయి. కరమ్ చావ్ల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. సంభాషణపరంగా సరికొత్తగా లేకపోయినా సన్నివేశపరంగా బాగున్నాయి.
అదేవిధంగా ఇప్పటి సీరియల్స్‌పైనా, లాయర్ వ్యవస్థపైనా సున్నితంగా తప్పొప్పుల్ని వేలెత్తి చూపిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లాగించేశాడు. ఇదే ఇందులో వున్న మెసేజ్. అధికారం, డబ్బు హోదా వున్న రావురమేష్ వాళ్ళు తప్పులుచూస్తూ పోతే దాన్ని అదేరూటులో వెళ్ళి కంట్రోల్ చేసేలా లాయర్ గోపీచంద్ పాత్ర వుంది. సరదాగా సాగే పాటలు, రాశీఖన్నా చేసే కామెంట్ ఈ చిత్రానికి బలం. సరదాగా నవ్వుకునేట్లుగా వున్న ఈ పక్కా కమర్షియల్ కుటుంబంతో కలిసి చూసేట్లుగా వుంది.
రేటింగ్-3/5