శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (18:41 IST)

థ్రిల్ల‌ర్‌గా సాగే `ఎ`

A movie
నటీనటులు : నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని త‌దిత‌రులు
సాంకేతిక‌తః  సినిమాటోగ్రఫి : ప్రవీణ్ కె బంగారి, ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్, సంగీతం; విజయ్ కురాకుల, సాహిత్యం : అనంత్ శ్రీరామ్, నిర్మాత; గీతా మిన్సాల, దర్శకత్వం; యుగంధర్ ముని.
 
నితిన్ ప్రసన్న హీరోగా చేసిన తెలుగు సినిమా ఏ ( అడ్ ఇన్ఫినీటం). 2018లో తమిళ్ సినిమా సయి చిత్రంలో నెగిటివ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.`ఎ`టైటిల్ అంటే ఏమిటి అనేది మొద‌టి నుంచి ఆస‌క్తి వుంది. అదేవిధంగా ఇందులో నితిన్ ప్రసన్న మూడు పాత్రలకున్న లింక్ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
 
కథ :
 
రోడ్డు ప్ర‌మాదానికి గురైన వ్య‌క్తిని అటుగా వెళుతున్న వారు ఆసుప‌త్రిలో జాయిన్ చేస్తారు. కోలుకున్నాక గ‌తాన్ని మ‌ర్చిపోతాడు. అయినా అత‌న్ని నీడ‌లా కొన్ని గుర్తులు వెంటాడుతుంటాయి. చివ‌రికి నే నెవ‌రిని అంటూ మ‌న‌స్సు వేధిస్తుంది. అక్క‌డే న‌ర్సుగా వున్న పల్లవి ( ప్రీతి అస్రాని ) తనను దగ్గరుండి చూసుకోవడంతో ఆమెపై అభిమానం పెరిగి ప్రేమగా మారుతుంది. పల్లవి కూడా అతని ప్రేమలో పడిపోతుంది. సంజీవ్ అనే పేరు పెట్టి పెళ్లి చేసుకుంటుంది. కానీ అత‌న్ని కల వెంటాడుతుంది ? తాను ఎవరు ? ఎక్కడినుండి వచ్చాను ? అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు ? మరి అతనికి తన గతం గురించి తెలిసిందా ? అతనికి మిగతా ఇద్దరికీ గల సంబంధం ఏమిటి ? అన్నది సినిమా.
 
విశ్లేష‌ణః
 
ఇందులో ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్ చాలా ఆస‌క్తిక‌రం. మ‌నిషి మెద‌డులో వుండే ఓ క‌ణాన్ని కంట్రోల్ చేస్తే ఎప్పుడు యంగ్‌గానే వుంటాడు. సైంటిస్ట్ చేసే ప్ర‌యోగ‌మే క‌థ‌. ఈ పాయింట్ చాలా కీల‌క‌మైంది. ఈ త‌ర‌హా క‌థాంశాలు హాలీవుడ్‌లో వ‌స్తుంటాయి. కానీ తెలుగులో చేసిన ప్ర‌యోగం అభినంద‌నీయ‌మే. అయితే ఆ క్ర‌మంలో కొంద‌రు కిడ్నాప్‌కు గుర‌వుతుంటారు. ఇవ‌న్నీ థ్రిల్లింగ్ క‌లిగిస్తాయి. ఇందులో నితిన్ ప్రసన్న హీరోగా, విలన్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు హీరో. మూడు పాత్రల్లో అయన నటించిన తీరు బాగుంది. ముఖ్యంగా గతం మరచిపోయిన వ్యక్తిగా తన గతం గురించి వెతుక్కునే వ్యక్తి సంజీవ్ గా ఆకట్టుకునే నటన కనబరిచాడు. ఇక హీరోయిన్ పల్లవి పాత్రలో ప్రీతి అస్రాని నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి. గృహిణిగా ఒక తల్లి బిడ్డ పాత్రలో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే విప్లవకారుడు పాత్రలో నితిన్ ప్రసన్న చక్కగా చేసాడు. ఇందిరాగాంధీ పాలన సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన విప్లవ వీరుడి పాత్రలో చక్కగా నటించాడు. నితిన్ ప్రసన్న వన్ మెన్ షో చేసాడని చెప్పాలి.
 
సాంకేతికంగా చూస్తే,  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ కు టెక్నీకల్ అంశాలే కీలకం.. ఈ విషయంలో దర్శకుడు ప్రతి విభాగం నుండి మంచి అవుట్ ఫుట్ రాబట్టాడు. రీరికార్డింగ్ బాగుంది. విజయ్ కురాకుల అందించిన మ్యూజిక్ సూపర్ అని చెప్పాలి. ప్రవీణ్ కె బంగారి కెమెరా పనితనం సూపర్బ్. ఇంటెన్సివ్ ఫోటోగ్రఫి తో సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాడు. ఆనంద్ పవన్, మ‌ణి కందన్ అందించిన ఎడిటింగ్ బాగుంది. అయితే ద్వితీయార్థంలో కొన్ని అన‌వ‌స‌ర‌మైన సీన్లు వచ్చాయి. వాటికి ప‌ని చెప్పాల్సింది. కొన్ని సీన్స్ తగ్గించి ఉంటె కథ ఇంకా చక్కగా సాగేది. ఇక దర్శకుడు యుగంధర్ ముని తీసుకున్న పాయింట్ కొత్త‌గా వుంది. సూపర్.
 
ఇలాంటి సినిమాలు డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా చెప్ప‌వ‌చ్చు. ఇప్పటివరకు మనం ఎన్నో థ్రిల్లర్స్ చూసివుంటాం. అయితే ఈ సినిమాలో కూడా ఆ బ్లాక్ షీప్ ఎవరు అన్న విషయాన్నీ చాలా స‌స్పెన్స్ క‌లిగించేలా చేశాడు.  థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే సినిమా అవుతుంది.
రేటింగ్ః3/5