గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (17:05 IST)

కంటెంట్ ఉన్న సినిమాలే నిలబడుతున్నాయి : మురళి మోహన్

Harish Bompelli  Manya Saladi
Harish Bompelli Manya Saladi
కౌండిన్య ప్రొడక్షన్స్ పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓసి. ఈ రోజు ఘనంగా ఓసీ థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్రపరిశ్రమ నిర్మాత, నటుడు మురళి మోహాన్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ట్రైలర్ అనంతం జూన్ 7న విడుదల కాబోతున్న ఈ చిత్రం మొదటి టికెట్‌ను ఎమ్మెల్యే  వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసి, ఫస్ట్ టికెట్ ఆయనే తీసుకున్నారు.
 
Murali Mohan with OC  team
Murali Mohan with OC team
డా. మురళి మోహాన్ మాట్లాడుతూ.. డబ్బులున్నంత మాత్రానా హీరో అవలేరు, దానికి ఎంతో శ్రమ, పట్టుదలతో పాటు అదృష్టం కూడా ఉండాలి అని అన్నారు. ఇక ఓసీ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది అని కొనియాడాారు. ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాతలతో పాటు పనిచేసిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మధ్య చిన్న, పెద్ద సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ కథ, కంటెంట్ ఉన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతున్నాయని పేర్కొన్నారు. తెలుగు పరిశ్రమ వైపు ఈరోజు ప్రపంచమే చూస్తోంది, మంచి మంచి కథలతో కొత్త ఆలోచనలతో యువకులు ముందుకు రావాలి అన్నారు. అలాగే ఓసీ సినిమా ట్రైలర్ చూస్తేనే ఇలా ఉందంటే విడుదల తరువాత ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకంగా తెలిపారు. ఇక ఓసీ అంటే ఏంటో తెలియాలంటే అందరితో పాటు తాను కూడా జూన్ 7 వరకు ఎదురు చూస్తా అని పేర్కొన్నారు.
 
కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆయనకు సినిమాకు మంచి సంబంధం ఉందని, ఆయనకు ఉన్న ఏకైక అలవాటు సినిమాలు చూడడమే అని తెలిపారు. ఆయన దరువు, రజాకార్ తరువాత ఇప్పుడు ఓసీ సినిమా వేడుకకే వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం డైరెక్టర్, హీరో తమ ప్రాంతం వారేనని, ఈ విషయంలో ఆయన గర్వపడుతున్నట్లు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో విజయం సాధించాలంటే మాములు విషయం కాదని, ఎంతో ట్యాలెంట్, ఓపిక ఉండాలని ఆ రెండు ఈ ఇద్దరి అన్నదమ్ములకు ఉందని డైరెక్టర్, హీరోలను ఉద్దేశించి అభినందించారు. ఇలాగే వీరు మంచి చిత్రాలను చేయాలని, మరెందరికో స్పూర్తిగా నిలువాలని ఎమ్మెల్యే అన్నారు. ఇక ట్రైలర్ బాగుందని, కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని జూన్ 7న ఆయన సైతం థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తానన్నారు.
 
మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ..ఓసీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లా ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది అని పేర్కొన్నారు. ఇక కుటుంబం మొత్తం ఒక సినిమా కోసం ఇలా నిలబడడం చాలా ఉన్నతమైన విషయం అని పేర్కొన్నారు. సినిమా అంటేనే వందల మంది కలిసి పనిచేస్తారు. ఒక సినిమా విజయం సాధిస్తే చాలా మందికి విజయం చేకురుతుంది. ఉపాది కలుగుతుంది అని ఓసీ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు.
 
హీరోయిన్ మాన్య సలాడి  మాట్లాడుతూ..  ఈ చిత్రంలో తాను బాలారాణి క్యారెక్టర్ చేసినట్లు ఆ పాత్ర కచ్చితంగా ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది అని పేర్కొన్నారు. జూన్ 7న కచ్చితంగా థియేటర్లో సినిమాను చూడండి అని కోరారు.
 
ఓసీ చిత్ర దర్శకుడు  విష్ణు బొంపెల్లి మాట్లాడుతూ.. కేవలం పాషన్‌తో చేస్తున్న జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపారు. సినిమా మంచిగా రావడం కోసం కాస్ట్ అండ్ క్రూను చాలా హింసలు పెట్టినట్లు చెప్పారు. సినిమా తీస్తున్న అని చెప్పినప్పుడు ఆయన స్నేహితులే ఆయన్ను నమ్మలేదని, తన చుట్టు ఉన్నవారు తన వళ్ల కాదని చెప్పినా ఈ రోజు సినిమా చేశామంటే దానికి ఒక్కటే కారణం మనల్ని మనం బలంగా నమ్మడమే అని  విష్ణు బొంపెల్లి వెల్లడించారు. ఇక సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు చాలా అప్ అండ్ డౌన్స్ చూసినట్లు చెప్పారు. నిజంగా సినిమా అంటే వైకుంఠపాలి గేమ్ అని అభివర్ణించారు. చాలా కష్టాలు దాటుకొని జూన్ 7న సినిమాను విడుదల చేయగలుగుతున్నామంటే దానికి కారణం అమ్మనాన్నల తరువాత సార్థక బ్యానర్ అధినేత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బుర్ర ప్రశాంత్ గౌడ్ అని పేర్కొన్నారు. కేవలం ఆయన మూలంగానే సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నామని ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఇక కచ్చితంగా సినిమా అందరిని అలరిస్తుందని డైరెక్టర్ విష్ణు బొంపెల్లి నమ్మకంగా చెప్పారు.
 
 హీరో హరిష్ బొంపెల్లి మాట్లాడుతూ, లగ్జరీ లైఫ్ ను వదిలేసి ఎంతో ప్యాషన్ తో విష్ణు బొంపెల్లి ఇండియాకు వచ్చి సినిమాను డైరెక్ట్ చేశాడని తెలిపారు. ఒక సందర్భందలో ఇద్దరి అకౌంట్లో కేవలం రూ. 74 మాత్రమే ఉండే అని అయినా సరే తగ్గేదేలే అని ముందుకు సాగినట్లు వెల్లడించారు. ఆ సందర్భంలో అక్క, భావలు ఎంతో సాయం చేశారు. చివరికి వాళ్ల అమ్మ నగలు, డాడీ ఇల్లు కూడా తాకట్టు పెట్టినట్లు చెప్పారు. ఇలా ఎన్నో కష్టాలు పడి సినిమా పూర్తి చేసి విడుదల చేయమని ఆఫీస్ ల చుట్టు తిరిగితే ఎన్నో అవమానాలు ఎదురైనట్లు చెప్పారు. 
 
ఈ కార్యక్రామానికి చిత్రం కాస్ట్ అండ్ క్రూతో పాటు యువ హీరో శ్రీరామ్ నిమ్మల, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు.