శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (10:48 IST)

అక్టోబర్ 31న బ్లూ మూన్.. మళ్లీ ఈ విశేషం.. 2039లోనే..

Blue Moon
అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు జరగనున్నాయి. హాలోవీన్ వేడుకలు అంటే విచిత్ర వేషధారణల మధ్య చేసుకునే ఉత్సవం. ఇదే సమయంలో బ్లూ మూన్ ఏర్పడటం విశేషం. ఈ నెల 31న ఆకాశంలో అద్భుతం కనువిందు చేయనుంది. ఆ రోజు నిండుచంద్రుడు కనిపించనున్నాడు. ఇది ఈ అక్టోబరు నెలలో ఏర్పడే రెండో పౌర్ణమి కావడంతో దీన్ని బ్లూ మూన్‌గా పిలుస్తారు.
 
బ్లూ మూన్‌ను కొన్ని దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు. చలికాలంలో రాత్రిపూట జంతువులను వేటాడటానికి వేటగాళ్లకు ఈ పౌర్ణమి సహకరిస్తుంది . అందుకే దీన్ని హంటర్ మూన్ అని అంటారు. 
 
బ్లూ మూన్ లేదా హంటర్ మూన్ అనేది సాధారణంగా ప్రతీ రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది. గతంలో 2018 లో ఈ బ్లూ మూన్ ఏర్పడింది. ఈ నెల 31న మనమంతా ఈ బ్లూ మూన్ వీక్షించవచ్చు. ఈ ఏడాది తరువాత బ్లూమూన్ తిరిగి 2039లో ఏర్పడనుంది.