శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (12:00 IST)

రిసెప్షన్ వేదికపై కొట్టుకున్న వధూవరులు.. స్వీట్లు తింటూ..

ఎన్నెన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియోలో వివాహం అనంతరం రిసెప్షన్‌లో వధూవరులు చితకొట్టుకున్నారు. 
 
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏం జరుగుతుందంటే.. వివాహం అనంతరం రిసెప్షన్‌ జరుగుతోంది. వరుడు తన కుటుంబ సభ్యులతో వేదికపైకి చేరుకుంటాడు. 
 
కాసేపటి తర్వాత వధువు కూడా తన కుటుంబ సభ్యులతో వేదికపైకి వస్తుంది. జయమాల సమయంలో వరుడికి వధువు ముందుగా స్వీట్లు తినిపిస్తుంది. 
 
వరుడు చాలా ప్రేమతో ఆ స్వీట్లు తింటాడు. ఆపై వరుడు స్వీట్ పెట్టగా.. వధువు తినడానికి నిరాకరిస్తుంది. అయినా వదలని వరుడు ఆమెకు బలవంతంగా స్వీట్లు తినిపించే ప్రయత్నం చేస్తాడు.
 
వధువు స్వీట్ తినకుండా వరుడుని పక్కకు నెట్టేస్తోంది. దాంతో కోపోద్రిక్తుడైన వరుడు వధువును చెంపదెబ్బ కొడతాడు. వధువు సైతం కోపంతో ఊగిపోయి వరుడిని కొడుతుంది. 
 
కుటుంబ సభ్యులు ఆపినా వధువు వెనక్కి తగ్గదు. వరుడితో గొడవ పడుతుంది. ఇద్దరూ కాపేపు వేదికపైనే కొట్టుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.