చెల్లి వరసయ్యే యువతికి తాళి కట్టిన అక్క... ఎక్కడ?

Sisters
మోహన్| Last Modified గురువారం, 4 జులై 2019 (17:30 IST)
సాధారణంగా స్త్రీపురుషులు వివాహం చేసుకుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సాక్షాత్తూ దేశ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన కారణంగా చాలామంది స్వలింగ సంపర్కులు తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వారిలో కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకుంటున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఇలాంటి ఘటనే ఇందుకు నిదర్శనం. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు అమ్మాయిలు బుధవారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలాంటి వివాహం పవిత్ర పుణ్యస్థలం అయిన వారణాసిలో జరగడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధాని మోదీ ఎంపీగా గెలుపొందిన నియోజకవర్గం కావడం విశేషం.

కాన్పూర్‌కు చెందిన ఓ యువతి తనకు చెల్లి వరుసయ్యే మరో యువతిని స్థానికంగా ఉండే శివాలయానికి తీసుకువెళ్లింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. తాము ఒకరినొకరు ప్రేమించుకున్నామని, తమకు పెళ్లి చేయవలసిందిగా పూజారిని కోరగా, ఆయన అందుకు నిరాకరించారు. అయితే కొంతసేపటికి వారు తమకు తాముగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ప్రస్తుతం వారణాసిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.దీనిపై మరింత చదవండి :