'అసోం బాహుబలి'? : జింకపిల్లను కాపాడిన శివగాముడు
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆందరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లోనూ భారతీయ సినిమాల సత్తాను నిరూపించింది.
ఈ చిత్రం అరంభంలో శివగామి, తన మనవడిని నీటిలో మునగకుండా కాపాడే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే, అటువంటిదే ఒకటి బంగ్లాదేశ్‌లో జరిగింది. వరద పెరిగిపోయిన వేళ, నీటిలో కొట్టుకుపోతున్న ఓ జింక పిల్లను బిలాల్ అనే యువకుడు కాపాడాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అయ్యాయి.
అయితే, కొందరు ఇది అసోంలో జరిగిన ఘటనగా పేర్కొన్నప్పటికీ, ఇది బంగ్లాదేశ్‌లో తీసిన పిక్ అని, 2014లో అక్కడి నౌకాలీ జిల్లాను వరదలు ముంచెత్తినప్పుడు జరిగిన ఘటన ఇదని పలువురు నిజాన్ని వెలుగులోకి తెచ్చి కామెంట్లు పెట్టారు.
అయినప్పటికీ, తాజాగా, ఈ పిక్ మరోమారు వైరల్ అయి, 'బాహుబలిని'ని గుర్తుకు తేగా, పలువురు అతని ఆనాటి సాహసాన్ని 'శివగామి'తో పోలుస్తూ, ఇతన్ని శివగాముడు అంటూ మెచ్చుకుంటున్నారు.