శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (10:27 IST)

మదనపల్లె సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పవన్ అభిమాని

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని మదనపల్లె సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు నాడు పవన్‌తో పృథ్వి తేజ వున్న వీడియోను, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పవన్ అభిమాని సబ్ కలెక్టర్ కావడం తమకు ఎంతో గర్వకారణం ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు. 
 
కాగా తొమ్మిదేళ్ల క్రితం పవన్ పంజా సినిమా ఆడియో వేడుకలో ఐఐటీ జేఈఈలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి పృథ్వి తేజను పవన్ సన్మానించి అభినందిచారు. ఇంకా పృథ్వీ తేజ ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆకాంక్షించారు. పవన్ ఆకాంక్ష మేరకు ఆ పృథ్వి తేజ సివిల్స్‌లో 24వ ర్యాంక్ సాధించి.. మదనపల్లె సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.