శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (22:57 IST)

నవజాత శిశువుతో విధులకు వచ్చిన తిరువనంతపురం మేయర్

Thiruvananthapuram
Thiruvananthapuram
తిరువనంతపురం మేయర్ తన నవజాత శిశువుతో విధులకు తీసుకురావడం చర్చకు దారితీసింది. తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ తన ఒక నెల పాపతో తన కార్యాలయంలో పనిచేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
తిరువనంతపురం మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్య రాజేంద్రన్ దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. మేయర్ ఆర్య రాజేంద్రన్ తన చిన్నారిని తీసుకుని ఫైళ్లను సమీక్షిస్తున్న చిత్రం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వృత్తిపరమైన, వ్యక్తిగత బాధ్యతలు రెండింటినీ సమర్థవంతంగా నిర్వర్తించారు. బాలింత కావడంతో పాటు నెల వయస్సుండే బిడ్డతో విధులకు రావడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.