శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (13:45 IST)

పడకగదికి లేత నీలి రంగు పెయింట్ వేస్తే.. దంపతుల మధ్య?

ఇంటికి వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులను వేయడం ద్వారా సానుకూల ఫలితాలుంటాయి. భవనం గోడలకు వాస్తు రంగులను ఉపయోగించడం ద్వారా ఆ ఇంట నివసించే వారికి, బయటి నుంచి చూసేవారికి అనుకూల ఫలితాలుంటాయి. వాస్తు రంగుల ద

ఇంటికి వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులను వేయడం ద్వారా సానుకూల ఫలితాలుంటాయి. భవనం గోడలకు వాస్తు రంగులను ఉపయోగించడం ద్వారా ఆ ఇంట నివసించే వారికి, బయటి నుంచి చూసేవారికి అనుకూల ఫలితాలుంటాయి. వాస్తు రంగుల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓ భవనానికి వెలుపల, లోపల వాస్తు ప్రకారం ఈ రంగులను ఉపయోగిస్తే.. ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.  
 
భవనానికి వెలుపులి గోడలకు తెలుపు లేదా లేత పసుపు రంగును ఉపయోగించవచ్చు. హాలుకు ఆఫ్ వైట్ కలర్ ఉపయోగించాలి. ఇక ఇంట్లోని పడకగదికి లేత నీలిరంగులను ఉపయోగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యతకు లోటుండదు. ఆగ్నేయ దిశలో పడకగది ఉన్నట్లైతే.. లేత ఆకుపచ్చ రంగును వేయడం ద్వారా దంపతుల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకోవు. 
 
అయితే లేత ఆకుపచ్చరంగుతో కూడిన పెయింట్‌ను తూర్పు వైపునున్న పడకగదులకు ఉపయోగించకూడదు. అలాగే లేత నీలి రంగులను పడకగదికి ఉపయోగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒంటి నొప్పులు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య జగడాలకు తావుండదు. నీలి రంగు ఆకాశానికి, నీటికి ప్రతీక కావడంతో భాగస్వాముల మధ్య నిజాయితీ, దాపరికం లేని జీవితాన్ని పెంపొందింపజేస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.