దీపావళి రోజున లక్ష్మీదేవిని ఏ దిశలో అమర్చుకోవాలంటే..?
దీపావళి పండుగ అన్ని మతాలు చేసుకునే పండుగ. ఈ పండుగను ఈ మతస్తులు మాత్రమే చేసుకోవాలని లేదా ఎవరైన చేసుకోవచ్చు. కానీ, హిందూలు మాత్రం దీపావళి పండుగను ఘనం జరుగుపుకుంటారు. అందుకు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను ఏ దిశలో అమర్చుకోవాలో తెలియడం లేదు.. కనుక వాస్తుశాస్త్రం ప్రకారం.. విఘ్నేశ్వరుడు, ఇంద్ర, కుబేరుడను పూజించేందుకు ఈశాన్యం లేదా ఉత్తర, తూర్పు దిశగా ఉండేలా చేయాలి.
వాస్తు ప్రకారం దీపావళి ముందు రోజున ఇంటిని శుభ్రం చేసుకుని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. అలానే మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల ఆహారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.
ఉత్తరం దిశలో కుబేర స్థానం చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకోవచ్చు. ఆ లాకర్‌లో లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.