జీవితంలో అప్పు సమస్యను అధిగమించాలంటే...
జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం మనకు మంచి జరుగుతుందా.. చెడు జరుగుతుందా అనేది తెలిసిపోతూ ఉంటుందట. ఆ సంకేతాలు మనం గుర్తించే విధానాన్ని బట్టి ఉంటుందట. ప్రతి మనిషి తమ ఆరోగ్య పరిస్థితి గురించి కానీ లేకుంటే ఆర్ధిక లావాదేవీల గురించి కానీ జ్యోతిష్య శాస్త్రం సూచి
జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం మనకు మంచి జరుగుతుందా.. చెడు జరుగుతుందా అనేది తెలిసిపోతూ ఉంటుందట. ఆ సంకేతాలు మనం గుర్తించే విధానాన్ని బట్టి ఉంటుందట. ప్రతి మనిషి తమ ఆరోగ్య పరిస్థితి గురించి కానీ లేకుంటే ఆర్ధిక లావాదేవీల గురించి కానీ జ్యోతిష్య శాస్త్రం సూచించే సూచనలను పాటిస్తూ ఉంటారు. అస్సలు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్థిక సమస్యలు తొలగితే చాలట.
జీవిత బాగస్వామితో తరచూ గొడవలు పడుతుంటే మీరు ఆర్థికంగా నష్టపోతారట. అంతేకాదు మీ ఇంటి ముందు నుంచి నీరు ప్రవహించినా లేకుంటే ఎల్లప్పుడూ తడిగా ఉన్నా కుటుంబ కలహాలు తీవ్ర స్థాయిలో ఉంటాయట. జీవితంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా ముందుకు వెళ్ళాలట.
అధిగ ఒత్తిడి ఉంటే మనిషి అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారట. అంతేకాదు దాచుకున్న డబ్బు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. కొంతమంది అనారోగ్యంతో భోజనం చేయరు. కానీ కొంతమంది ఆరోగ్యంగా బాగుంటే ఇష్టమొచ్చినట్లు తింటుంటారట. అలా తింటే అప్పుల్లోకి వెళ్ళి అయిన వారితో నానా మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. అందుకే దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంటుంటారు. అంతేకాదు వంటరూములోను, బాత్ రూంలోను నీటి చుక్కులు పడుతూ ఉంటే సమస్యలు మొదలవుతాయట. నీటి చుక్కల లాగా ఆస్థి కూడా కరగడం ప్రారంభమవుతుందట.