శనివారం, 16 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By chj
Last Modified: బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (20:22 IST)

ఇంటి వాస్తు దోషాలను తెలుసుకోవడం ఎలా?

ఇంటికి వాస్తు దోషం వున్నదని కనుక్కోవడం ఎలా అనే సందేహం వస్తుంటుంది. ఐతే వాస్తు దోషాలనేవి ఈ క్రిందివిధంగా ఉంటాయి. అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్

ఇంటికి వాస్తు దోషం వున్నదని కనుక్కోవడం ఎలా అనే సందేహం వస్తుంటుంది. ఐతే వాస్తు దోషాలనేవి ఈ క్రిందివిధంగా ఉంటాయి. అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడటం, అవమానాలు, ఇతర స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు. 
 
దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదేవిధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించడం మొదలగునవి అన్నీ వాస్తు దోషాలలోకి వస్తాయని వాస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువలన ఇంటి నిర్మాణము వాస్తురీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.