మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (16:13 IST)

భార్య గర్భంగా ఉంటే గృహ నిర్మాణం చేపట్టవచ్చా?

భార్య గర్భంగా ఉంటే గృహ నిర్మాణం చేపట్టకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. భార్య గర్భిణిగా ఉండి 5 నెలలు దాటాక గృహ ప్రవేశంగాని, నిర్మాణంగాని నిషేధమని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే రాత్రిపూట శంఖుస్థాపన గాని, గృహ నిర్మాణపు పని ప్రారంభం కానీ చేయరాదు. మొదటి జాము, నాలుగో జాము సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చే విధంగా ఇంటి నిర్మాణం ఉండాలి. 
 
గృహావరణలో పగలు సూర్యకాంతి-రాత్రి వెన్నెల ప్రసరించాలి. ఆవరణలోని ఆగ్నేయ, నైరుతి, వాయవ్య, పశ్చిమ దిశలలో గోతులుగాని, గుంతలు గానీ ఉండకూడదు. ప్రహరీ కట్టి ఈశాన్యాన బావి తవ్విన తర్వాతనే గృహ నిర్మాణానికి ఉపక్రమించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.