శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:27 IST)

గోడలకు కిటికీలు లేకపోతే.. ఏం జరుగుతుంది..?

చాలామంది ఎప్పుడూ చూసినా వ్యాధులతో బాధపడుతుంటారు. అందుకు కారణం.. ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం లేకపోవడం. కనుక ఇప్పుడైనా ఇంటి నిర్మాణాలు చేసేటప్పుడు తప్పక వాస్తు నిపుణులు సూచినలు తీసుకుని కట్టడాలు ప్రారంభించడం మంచిదని చెప్తున్నారు. మరి ఆ వాస్తు చిట్కాలేంటో చూద్దాం..
 
1. ఇంట్లోగానీ, ఇంటి ఆవరణలోగానీ రాత్రివేళలో చెవుల పిల్లులు నివశించునట్లయిన సుఖహీనత, రోగబాధ, మనోచాంచల్యం సంభవం. అలానే పెంపుడు జంతువుగా కొందరు చెవుల పిల్లులు పెంచుట కూడా ఈ పరిధిలోనికి వస్తుంది.
 
2. గృహావరణంలో గానీ, గృహంలో గానీ నీరు పుట్టలుండి, అందు సర్పాలు నివశిస్తున్నా, ఆ సర్పాలు ఇంట్లో సంచరిస్తున్నా రోగ బాధలు, దుస్వప్నాలు, సంతాన నష్టం కలుగుతుంది. 
 
3. గృహము నందు తగినన్ని స్తంభములు లేకున్నా రోగ బాధలు, అపమృత్యుభయం కల్గుతుంది. 
 
4. గృహము యొక్క దక్షిణ పశ్చిమ దిశలలో గోడలకు కిటికీలు లేక పోయినచో అల్పాయుర్దాయంగల సంతానం కలుగుతుంది. 
 
5. ద్వారం యొక్క తలుపులు శిధిలమై ఉన్నను, జీర్ణమై ఉన్నను లేక ద్వారాలకు తలుపులు లేకపోయినను దీర్ఘవ్యాధులు కలుగును. 
 
6. కొత్తగా నిర్మించే గృహమునకు పాతాదారువులను పెట్టి కట్టినచో మనోవైకల్యం, రోగ బాధలు తప్పవు. 
 
7. కొత్తగా కట్టే ఇంటిని కొత్త కలపతో కట్టినచో సర్వ సౌఖ్యాలు కలుగును.