గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (12:55 IST)

బీరువాలను ఏ దిశలో అమర్చాలి..?

ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు. పక్కింటివారి గోడలకు ముఖ ద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
 
అలాగే మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కారిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పెట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పెడితే ఆ ఉధృతి తగ్గుతుంది. 
 
ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి. ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కానీ, సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది. 
 
నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి.