1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By pnr
Last Updated : మంగళవారం, 1 మార్చి 2016 (16:15 IST)

అరటి పాన్‌కేక్స్‌‌ను ఎలా తయారు చేస్తారు?

ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు అరటి పండు. అలాంటి అరటిపండును భోజనం చేసిన తర్వాత ఆరిగించడమే కాకుండా, అనేక రకాలైన వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. అలాంటివాటిలో అరటితో పాన్‌కేక్స్ ఒకటి. దీన్ని ఎలా తయారు చేస్తారో ఓ సారి పరిశీలిద్దాం. 
 
కావలసిన పదార్థాలు
పండిన అరటిపండు - 1
మైదా - 1 కప్పు
పాలు - 2 కప్పులు
పంచదార - తగినంత 
బేకింగ్‌ పౌడర్‌ - తగినంత
 
తయారీ విధానం 
తొలుత పాలల్లో పంచదార, బేకింగ్‌ పౌడర్‌, మైదా, అరటిపండు గుజ్జు వేసి బాగా కలిపి.. ఓ పండిముద్దలా తయారు చేసిపెట్టుకోవాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే కొంత నీరు పోసి జారుగా చేసుకోవాలి. తర్వాత పెనంపై బటర్‌ రాసి దోశల్లా మందంగా పోసుకుని రెండు వైపులా దోరగా కాలేంత వరకు ఉంచి తీసెయ్యాలి. ఆ తర్వాత వేడి వేడిగా తేనెతో పాటు తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని పెద్దలతో పాటు.. చిన్నపిల్లలు కూడా అమితంగా ఇష్టపడతారు.