గోబీ 65 ఎలా చేయాలో తెలుసా...?
పిల్లలకు ఫ్రైడ్ ఐటమ్స్ అంటే తెగ ఇష్టపడతారు. కాలిఫ్లవర్‌లో విటమిన్ సి, కె. అధికంగా ఉంటుంది. క్యాన్సర్‌కు బ్రేక్ వేసే కాలిఫ్లవర్‌ను తీసుకోవడం ద్వారా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చును. గుండెపోటును దూరం చేసే కాలిఫ్లవర్లో విటమిన్ బి1, బీ2, బీ3, బీ5, బీ6, బీ9 విటమిన్లు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను అందజేసే కాలిఫ్లవర్‌తో కూరలే కాకుండా గోబి మంజూరియన్, 65ల ద్వారా పిల్లలకు నచ్చే విధంగా తయారు చేయవచ్చు. అలాంటి గోబి 65 ఎలా చేయాలో చూద్దామా..
కాలిఫ్లవర్ : రెండు పెద్దవి
పెరుగు : రెండు కప్పులు
ఉప్పు : తగినంత
పసుపు పొడి : ఒక టీ స్పూన్
మిరప పొడి : రెండు నుంచి మూడు టీస్పూన్లు
తండూరీ కలర్ : ఒక చిటికెడు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు
గరం మసాలా : ఒక టీ స్పూన్
పోపుకు..
ఆవాలు : రెండు టీ స్పూన్లు
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
కరివేపాకు : కాసింత
నూనె : తగినంత
తయారీ విధానం :
కాలిఫ్లవర్ పువ్వుల్ని శుభ్రం చేసుకుని వేడినీటిలో ఒక నిమిషం ఉంచి, కాసింత ఉప్పు కలిపి దించేయాలి. తర్వాత పువ్వుల్ని పురుగులు ఉన్నాయా చూసుకుని చిన్న చిన్నవిగా కాలిఫ్లవర్‌ను కట్ చేసుకుని పక్కనబెట్టుకోవాలి. పెరుగులో ఉప్పు, కారం, పసుపు పొడుల్ని వేసి, అల్లం వెల్లుల్లి పేస్టుతో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కాలిఫ్లవర్‌ను పది నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు చిటపటలాడాక.. కాలిఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి బాగా వేయించి దించేయాలి. ఈ గోబి 65ను రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.