సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:50 IST)

శీతాకాలంలో చుండ్రు సమస్య, ఇలా వదిలించుకోవచ్చు

శీతాకాలపు గాలి శిరోజాలను పొడిబారేట్లు చేస్తుంది. ఈ సమయంలో చుండ్రును ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు. అటువంటి పరిస్థితిలో, మీరు కొన్ని చిన్నచిన్న చిట్కాలను పాటించడం ద్వారా దాన్ని ఎదుర్కోవచ్చు.

 
1 గిన్నె పెరుగులో 1 టేబుల్ స్పూన్ మెంతి గింజల పొడి, 1 టేబుల్ స్పూన్ త్రిఫల పొడిని రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు, ఒక గంట పాటు దానిని మాడుపై మాస్క్‌లా అప్లై చేసి, ఆపై తేలికపాటి షాంపూతో కడిగేయండి. మీరు దీన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.

 
ఒక గిన్నె కొబ్బరి నూనె తీసుకుని 2 నిమిషాలు వేడి చేయండి. తర్వాత దానికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని వీలుంటే జుట్టుకు రాత్రంతా లేదా 2 గంటల పాటు అప్లై చేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. మీరు దీన్ని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.

 
1 కప్పు అలోవెరా జెల్‌లో రెండు టేబుల్‌స్పూన్ల ఆముదం కలపండి. దీన్ని మీ తలపై అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో కడిగేయండి. మీరు దీన్ని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.

 
ఒక కప్పు మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. దీన్ని పేస్ట్‌లా చేసి, దానికి 2 టేబుల్‌స్పూన్ల అలోవెరా జెల్ కలపండి. బాగా కలిపాక ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేసి గంట పాటు వదిలేయండి. ఆ తర్వాత జుట్టును నీటితో కడగాలి, ఆపై తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

 
2 గ్లాసుల మజ్జిగ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్ మిక్స్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం, ఈ ఔషధ మజ్జిగతో జుట్టును కడగాలి, ఆపై తేలికపాటి షాంపూని ఉపయోగించాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.