సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (20:33 IST)

మహిళల ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు.. అవిసె గింజలను..?

Woman
మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. పాలకూరను డైట్‌లో చేర్చుకోవాలి. మెగ్నీషియం కలిగిన పాలకూరని తినడం వల్ల మహిళల పీఎమ్ఎస్ లక్షణాలను అడ్డుకుంటుందని. పాలకూర ఎముకల పటుత్వానికి, ఆస్తమా రాకుండా ఉండేందుకు, రక్తపోటు నియంత్రించేందుకు కూడా సహాయ పడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండడానికి టొమాటోని తీసుకోండి. టొమాటో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
 
అలానే ఓట్స్ కూడా తీసుకోవడం చేయాలి. వీటి వల్ల గుండెతో పాటు జీర్ణ క్రియను ఇవి మెరుగు పరుస్తాయి. ఓట్స్‌ని తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల కలిగే భావోద్వేగాలను కూడా ఇవి నియంత్రిస్తాయి. ప్రతీ రోజు కొన్ని అవిసె గింజలు తీసుకోండి. అవిసె గింజలు గుండెకు ఎంతో మంచిది. అవిసె గింజల్లో వీటిలో వాపును, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
 
ఇక వారానికి నాలుగు సార్లు మొలకెత్తిన తృణధాన్యాలు తీసుకోవాలి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవి కొత్త రక్త నాళాలును ఉత్పత్తి చేస్తుంది. మంచి రక్త ప్రసరణకు సహాయపడుతుంది. మొలకలు అధిక స్థాయి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి వాపును తగ్గిస్తాయి. మొటిమలకు, చర్మ సమస్యలను దూరం చేస్తాయి.  
 
అలాగే సూర్యరశ్మి, పర్యావరణ కాలుష్యం వల్ల ఫ్రీ రాడికల్స్ సంభవిస్తాయి. మొలకల్లోని అనామ్లజనకాలు సూర్యుడు వల్ల పాడవుతున్న చర్మం, చర్మ క్యాన్సర్ నుండి చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.