1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (15:34 IST)

ఎంత తక్కువ తిన్నా.. పొట్ట తగ్గడం లేదు ఎందుకని?

నాకు పొట్ట కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. దీన్ని తగ్గించే పనిలోభాగంగా చాలా తక్కువ మోతాదులోనే ఆహారం తీసుకుంటాను. కానీ, పొట్ట మాత్రం తగ్గడం లేదు. ఎందుకని? పొట్ట పెరగడం అనేది సాధారణంగా శరీరతత్వాన్ని బట్టి వస్తుంది. అలాంటప్పుడు ఎంత తక్కువ ఆహారం తీసుకున్నా పొట్ట తగ్గక పోవడం జరగవచ్చు. అయితే ఇందులో కొవ్వు కాకుండా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో చూడటానికి మీరు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించడం ఉత్తమం. 
 
ఈ పరీక్షలో ఎలాంటి లోపాలు లేకపోతే మీరు భయపడనవసరం లేదు. ఇది మన శరీరతత్వాన్ని బట్టి వస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకొని, సమయానికి భోజనం చేయడం వంటివి పాటించాల్సి ఉంటుంది. ఇదేకాకుండా సమీపంలోని డాక్టర్‌ను కలిసి ఇతర రక్త పరీక్షలు కూడా చేయించుకుంటే మంచిది. సాధారణంగా మన ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో నిర్ణయించుకోడానికి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎంత ఆహారం తీసుకుంటాం, ఎంత ఖర్చవుతోంది, ఈ రెండు సమంగా ఉన్నాయా లేదా అనే విషయం కూడా చూసుకోవాలి.