గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 మే 2017 (10:27 IST)

ఒకే చోట కదలకుండా కూర్చునే మహిళల్లో ఎనిమిదేళ్లకు ముందే?

పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో మహిళలు రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటిని ఓ కంట కనిపెట్టుకుంటూ.. రాణిస్తున్న మహిళలు ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్

పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో మహిళలు రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటిని ఓ కంట కనిపెట్టుకుంటూ.. రాణిస్తున్న మహిళలు ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పది గంటల కంటే ఎక్కువగా ఒకేచోట కూర్చునే మహిళల శరీర కణాలు జీవపరంగా ఎనిమిదేళ్ల ముందుగానే వృద్ధాప్య ఛాయలు అలముకుంటాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
కదలకుండా గంటలు గంటలు ఒకే చోట కూర్చునే మహిళల్లో డీఎన్‌ఏ పోచల చివరన ఉండే టెలోమేర్స్ పొడవు తగ్గుతుందనే విషయం పరిశోధనలో వెల్లడైంది. వీటి పొడవు తగ్గడం అంటే వృద్ధాప్యానికి చేరువ కావడంతో సమానమని పరిశోధకులు తెలిపారు. ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం కూడా టెలోమేర్స్‌ పొడవు క్రమేపీ తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. 
 
అందుకే మహిళలు ఒకేచోట ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో అటూ ఇటూ నడవాలని.. రోజుకి కనీసం గంటపాటు వ్యాయామం చేస్తే టెలోమేర్స్ పొడవు తగ్గే ప్రమాదం నుంచి బయటపడవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.