శనివారం, 17 జనవరి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (17:06 IST)

బట్టతలకు చెక్ పెట్టాలంటే.. ఇలా చేస్తే చాలు..

నున్నని బట్టతల.. పట్టుమని పాతికేళ్ళయినా నిండలేదు.. ఎవరికి కనిపించినా ఎంతమంది పిల్లలని ప్రశ్నిస్తున్నారు.  ఇలా బట్టతలతో ఇబ్బంది పడే వారు చాలా మందే ఉన్నారు. వారి బట్టతల చిగురించడానికి ఆయుర్వేదంలో మంచి మార్గలే ఉన్నాయి.
 
బట్టతల రావడానికి అత్యుష్ణమే కారణం. అతి వేడి కారణంగా వెంట్రుకలకు కావాల్సిన కొవ్వు పదార్థం అందక రాలిపోతుంటాయి. జుట్టు పూర్తిగా పొడిబారిన తరువాత ప్రయత్నం చేస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అందుకే ముందుగా జాగ్రత్త తీసుకోవాలి. 
 
చింతాకు, ఉసిరికాయ రసం, పుదీనా ఆకులు మెత్తగా నూరి కొద్దిగా ఆలివ్ నూనె వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత వడగట్టి ప్రతిరోజూ సేవిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. నూరిన మెంతులను తలకు పట్టించాలి. తెల్లవారి స్నానం చేయాలి. నారింజ రసం తగినంత వేసుకుని భోజనానంతరం రెండు పూటలా తాగాలి. తరువాత తలకు ఎలాంటి తైలాలు వాడకూడదు. ఇలా క్రమంగా చేస్తే వీటి ఫలితంగా బట్టతలపై వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంది.