ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. యోగా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (21:09 IST)

యోగా ఎందుకు చేయాలో తెలుసా?

Yoga
పుట్టినప్పుడు నుండి మనం ఎన్నోసార్లు రకరకాల దుస్తుల్ని ధరిస్తు మారుస్తూ ఉంటున్నాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే మనం భుజించే ఆహారం కూడా రకరకాల రుచులతో భుజిస్తున్నాము. కాని మార్పు లేకుండా కడవరకు మనతో ఉండేది మాత్రం మన శరీరం.
 
మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, మన కల నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. మీ మనస్సు మీరు చెప్పిన విధంగా వినకుండా, దాని ఇష్టప్రకారం ఆలోచనలను పెంపొందిస్తుంది.
 
మీ కలలు నెరవేరాలంటే, మీ మనసు పట్టుదలతో ఉండాలి. మీ మనస్సు, మీ శరీరము మీరు నచ్చినవిధంగా పనిచేయాలని అంటే, మీ మనస్సుని, శరీరాన్ని, మీకు అనుగుణంగా తిప్పుకోవాలి. అలా అనుకూలంగా మనువైపు మరల్చుకొనేదే యోగా.