బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:09 IST)

24-09-2020 గురువారం దినఫలాలు - సాయి గుడిలో అన్నదానం చేస్తే...(video)

మేషం : బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రవాణా రంగంలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. నోటీసులు, రశీదులు అందుకుంటారు. స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకోవడంతో పాటు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 
 
వృషభం : పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. పరస్త్రీలతో సంభాషించునపుడు మెళకువ వహించండి. రావలసిన ధనం అతికష్టంమ్మీద చేతికందుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
మిథునం : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త ఆలోచనలు, పథకాలు రూపొందిస్తారు. చిన్న చిన్న విషయాలలో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. మీలోని సృజనాత్మకత సన్నగిల్లుతోందని గ్రహించండి. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. 
 
కర్కాటకం : కావాల్సినవి దక్కాలంటే మరింత శ్రమించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, కీలక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ  సమస్యలు సానుకూలమవుతాయి. మీ సంతానం ఉద్యోగ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనుపరుస్తారు. 
 
సింహం : స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. పోగొట్టుకున్న అవకాశం, పత్రాలు తిరిగి పొందుతారు. వాతావరణ ప్రతిబంధకాలు, శ్రమాధిక్యత తప్పవు. మాట తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారంవుంది. 
 
కన్య : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
తుల : మీ నోటిని అదుపులో ఉంచుకుని వ్యవహరించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సహచరుల సలహా వల్ల నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ముఖ్యమైన పనులను చేపట్టండి. 
 
వృశ్చికం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో మెళకువ అవసరం. వస్త్ర, బంగారం, ఎలక్ట్రానికల్ వస్తు వ్యాపారులకు లాభదాయకం. బంధు మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
ధనస్సు : అధైర్యపడకండి. ధైర్యంగా ముందుకు వెళ్లండి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబంలో ఉల్లాసకరమైన వాతావరణం నెలకొంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రణాళికా బద్ధంగా వ్యయం చేయవలసిన సమయం. ఆస్తి వ్యవహారాలలో ప్రయోజనాలు కానవస్తాయి. 
 
మకరం : మీ ఆర్థిక స్థోమతకు తగిన విధంగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువకావాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
కుంభం : సోదరీ, సోదరులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెద్దలు ఇచ్చే సలహా మీ కెంతో సంతృప్తినిస్తుంది. ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మీనం : మీరు మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదాడతాయి. ట్రాన్స్‌పోర్టు రంగంలోని వారికి పనివారితో చికాకులు తలెత్తుతాయి. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం.