1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-02-2024 మంగళవారం మీ రాశిఫలాలు - వరసిద్ధి వినాయకుడిని పూజించిన శుభం...

Weekly astrology
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ ఏకాదశి ప.12.04 ఆరుద్ర ప.2.22 రా.వ.2.58 ల 4.38. ఉ. దు. 8.50 ల 9.35 రా.దు 10.57 ల 11.48.
 
వరసిద్ధి వినాయకుడిని పూజించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- సహోద్యోగులతో అభిప్రాయభేధాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారిని ఆకట్టుకుంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. విద్యార్ధినులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. 
 
వృషభం :- టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి చికాకులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు రుణాలు తీరుస్తారు. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మిథునం :- విద్యార్థినుల తొందరపాటుతనం వల్ల చికాకులు తప్పవు. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు షాపింగ్ కోసం ధనం వెచ్చిస్తారు.
 
కర్కాటకం :- కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
 
సింహం :- కాంట్రాక్టర్లకు పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.
 
కన్య :- రావలసిన ధనం చేతికందుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
తుల :- బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. ఎదురయ్యే ప్రతి విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
వృశ్చికం :- కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బందిపడతారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడాల్సి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. బంధువులకు హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
మకరం :- ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి.
 
కుంభం :- దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. చెల్లింపులు వాయిదా వేస్తారు. ముఖ్యులవైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలుతలెత్తుతాయి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు.
 
మీనం :- రాబడికి మించిన ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులెదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. వాహనచోదకులకు జరమానాలు చెల్లించవలసి వస్తుంది.