గురువారం, 23 ఏప్రియల్ 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By PNR
Last Updated : ఆదివారం, 2 నవంబరు 2014 (14:56 IST)

చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే... ఆయుర్వేద చిట్కా!

చాలా మందికి దంతాల చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది. ఇలా వస్తుంటే ఉల్లిపాయని మెత్తగా నూరి పళ్లని, చిగుళ్లని మర్ధన చేయాలి. వేడి నీళ్లలో పసుపు, ఉప్పు వేసి పుకిళించి వేయాలి. అలాగే, ఉసిరి పచ్చడితో మొదటి ముద్ద తినండి. తగ్గిపోతుంది. 
 
ప్రతిరోజూ అన్నంలో శొంఠిపొడి వేసుకుని ఒక చెంచా నెయ్యితో కలిపి తింటే జీర్ణం చక్కగా అవడమే కాక గ్యాస్ చేరదు.
 
నల్లజీలకర్ర, ఉసిరిపొడి కలిపి నెయ్యితో కానీ, వెన్నతోకానీ కలిపి నాలుకపై రాసుకుంటే నోటిపూత తగ్గుతుంది.