ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (17:18 IST)

మధుమేహానికి చెక్ పెట్టే మామిడి పువ్వులు.. ఎలాగంటే..?

Mango Flowers
దంతాలకు, చిగుళ్లకు బలాన్నివ్వడంతో పాటు నోటిపూతకు దివ్యౌషధంగా పనిచేస్తుంది మామిడి పువ్వులు. మామిడి పువ్వుల్లో ధాతువులు, విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మామిడి పండ్లలోని ధాతువులు ఇందులోనూ వున్నాయి. గొంతులో నొప్పి ఏర్పడితే మామిడి పువ్వులను తెచ్చుకుని శుభ్రం చేసి.. నీటిలో మరిగించి ఆపై వడగట్టుకోవాలి. ఆ మిశ్రమంలో కాస్త నిమ్మరసం చేర్చి తీసుకుంటే గొంతునొప్పి వుండదు. 
 
ఎండిన మామిడి పువ్వులను ధూపంలో వేస్తే దోమలువుండవు. మామిడి పువ్వులు, జీలకర్రను సమభాగంలో తీసుకుని.. ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను రోజూ అర స్పూన్ మేర తీసుకుంటే.. మూల వ్యాధి నయం అవుతుంది. వేడితో ఏర్పడే ఉదర రుగ్మతలను కూడా మామిడి పువ్వులు నయం చేస్తాయి. ఎండబెట్టిన మామిడి పువ్వులను బాగా పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తీసుకుంటే నోటిపూత ఏర్పడదు. 
 
ముఖ్యంగా మామిడి పువ్వులు డయాబెటిస్ పేషెంట్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మామిడి పువ్వులు, నేరేడు గింజలను సమానంగా తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రోజూ ఈ మిశ్రమాన్ని ఓ స్పూన్ పరగడుపున వేడినీటితో తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.