ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By kowsalya
Last Updated : గురువారం, 10 మే 2018 (11:34 IST)

తేనె - వాక్స్ మిశ్రమంతో అవాంఛిత రోమాలకు చెక్

పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి.

పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని  మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. వెంటనే కాటన్ స్ట్రిప్స్‌ని వాక్స్‌పై అంటించి వెంట్రుకలు పెరిగే దిశలో లాగేయాలి.
 
ఈ వాక్స్ వల్ల నొప్పి అంతగా ఉండదు. దీనివల్ల అవాంఛిత రోమాల సమస్య తీరుతుంది. తేనెతో కూడిన ఈ వాక్స్ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ వాక్స్ వల్ల చర్మానికి సంబంధించిన ఎటువంటి అలర్జీలు దరికి చేరవు. ఈ రకమైన వాక్స్ అన్ని రకాల చర్మంపై బాగా పనిచేస్తుంది.